దేశంలో కొత్తగా 15,144 కరోనా కేసులు
న్యూఢిల్లీ: గడిచిన 24గంటల్లో దేశంలో 15,144 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఆదివారం కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ బులిటెన్ విడుదల చేసింది. తాజాగా వైరస్ నుంచి మరో 17,170 మంది కోలుకున్నారని పేర్కొంది. అలాగే కొత్తగా మరో 181 మంది మహమ్మారి బారినపడి మృత్యువాత పడ్డారని చెప్పింది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,05,57,985కు పెరిగింది. ప్రస్తుతం 2,08,826 క్రియాశీల కేసులు ఉన్నాయని తెలిపింది. ఇప్పటి వరకు వైరస్ నుంచి 1,01,96,885 మంది కోలుకున్నారని.. 1,52,274 మంది మృత్యువాతపడ్డారని వివరించింది.