దేశంలో కొత్తగా 12,286 కొవిడ్ కేసులు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 12,286 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు మంగళవారం ఉదయం కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ బులిటెన్ విడుదల చేసింది. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,11,24,527కు పెరిగింది. తాజాగా 12,464 మంది డిశ్చార్జి అయ్యారు. కాగా దేశంలో మొత్తం ఇప్పటి వరకు 1,07,98,921 మంది చికిత్స అనంతరం కరోనా నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో తాజాగా మరో 91 మంది మృత్యువాతపడ్డారు. కాగా ఇప్పటి వరకు దేశంలో మొత్తం మృతుల సంఖ్య 1,57,248 చేరింది. ప్రస్తుతం దేశంలో 1,57,248 క్రియాశీల కేసులున్నాయని అధికారులు వెల్లడించారు.