దేశంలో ల‌క్ష‌ల‌కు చేరువ‌వుతున్న రోజువారీ కేసులు

న్యూఢిల్లీ: భార‌త్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. వైరస్ సోకిన రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దాదాపు ల‌క్ష‌కు చేరువ‌వుత‌న్న రోజువారి కేసుల సంఖ్య‌. సోమవారం దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య 42 లక్షలు దాటింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం… గత 24 గంటల్లో 90,802 కొత్త కేసులు నమోదయ్యాయి. వ్యాధి సోకిన వారి సంఖ్య 90 వేలు దాటడం… వరుసగా ఇది రెండో రోజు. అదే సమయంలో, ఈ కాలంలో 1,016 మంది ఈ వైరస్ బారిన పడ్డారు. డేటా ప్రకారం దేశంలో ఇప్పటివరకు 42,04,614 మంది కరోనా బారిన పడగా, ప్రస్తుతం దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,82,542.
మరోవైపు, చికిత్స తర్వాత వైరస్ ను అధిగమించి 32,50,429 మంది ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. కాగా, కోవిడ్ -19 నుండి మరణించిన వారి సంఖ్య 71,642. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) సెప్టెంబర్ 6 వరకు 4,95,51,507 నమూనాలను పరీక్షించినట్లు నివేదించింది. ఇందులో నిన్న 7,20,362 నమూనాలను పరీక్షించారు.
కాగా దేశంలో క‌రోనా కేసులు ప్ర‌తిరోజు భారీగా న‌మోద‌వుతున్నాయి. నిన్న‌ 90,600 కేసులు న‌మోద‌వ‌గా, ఈరోజు దానికి మించి రెండు వంద‌ల కేసులు అధికంగా న‌మోద‌య్యాయి. దీంతో ఒక్క రోజు వ్య‌వ‌ధిలోనే క‌రోనా కేసులు 42 ల‌క్ష‌ల మార్కును దాటాయి.

Leave A Reply

Your email address will not be published.