దేశవ్యాప్తంగా `ఉప` ఫలితాలపై వాడీవేడి చర్చ
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా రాజకీయాలపై ఒక్కసారిగా ఉప ఎన్నికలపై వాడీవేడి చర్చ జరుగుతోంది. పలు రాష్ట్రాల్లో 56 అసెంబ్లీ స్థానాల్లో ఈ నెల 3న ఉప ఎన్నికలు జరిగాయి. మంగళవారం ఓట్ల లెక్కింపు ప్రారంభకావడంతో ఆయా స్థానాల్లో అభ్యర్థుల గెలుపోటములపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బీహార్‌లోని 243 స్థానాలతోపాటు మధ్యప్రదేశ్‌లో 28 స్థానాలు, గుజరాత్‌లో 8 స్థానాలు, ఉత్తరప్రదేశ్‌లో 7 అసెంబ్లీ స్థానాలు, మరో 8 రాష్ట్రాల్లో కలిసి 15 అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపు ఈ ఉదయం. 8 గంటలకు ప్రారంభమైంది. బీహార్‌లో ఎన్డీఏ, ఆర్జేడీ కూటమి మధ్య హోరాహోరీ పోటీ ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనాల నేపథ్యంలో ఆ రాష్ట్ర ఫలితంపై దేశవ్యాప్తంగా ప్రజలు సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మధ్యప్రదేశ్‌లో..
మధ్యప్రదేశ్‌లో 28 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలు ఆ రాష్ట్రంలో అధికార పీఠాన్ని దక్కించుకునేది ఎవరనేది నిర్దేశించనున్నాయి. 9 స్థానాల్లో విజయం సాధిస్తే బీజేపీ తిరిగి అధికారం నిలబెట్టుకునే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన 25 స్థానాలతోపాటు మరో మూడు స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు మృతి చెందడంతో 28 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. మధ్యప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 230 స్థానాలు ఉన్నాయి. అధికారం చేపట్టడానికి 116 సీట్లు అవసరం. అయితే, అసెంబ్లీలో ప్రస్తుతం బీజేపీకి 107 మంది, కాంగ్రెస్‌కు 87 మంది శాసనసభ్యుల బలం ఉంది.
యూపీలో..
యూపీలో ఏడు స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా 93 మంది బరిలో ఉన్నారు. హత్రాస్ ఘటన నేపథ్యంలో ఎన్నికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
కర్ణాటకలో..
ఇక దక్షిణాదిలో కర్ణాటకలో రెండు స్థానాలకు, తెలంగాణలో దుబ్బాకలో ఉప ఎన్నికలు జరిగాయి. కర్ణాటకలో రెండు స్థానాలకే ఎన్నికలు జరిగినప్పటికీ కాంగ్రెస్ నేత డీకే శివకుమార్‌కు అవి అగ్నిపరీక్షగా పరిణమించాయి.
బెర్మో స్థానంలో..
కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేంద్ర ప్రసాద్ సింగ్ మేలో మరణించారు. నాగాలాండ్‌లో పీపుల్స్ ఫ్రంట్‌కు చెందిన అసెంబ్లీ స్పీకర్ విఖో ఓ యోషు టీ తోరెచు మరణం అనంతరం కొహిమా జిల్లాలోని దక్షిణ అంగమి-1 స్థానంతో పాటు కిఫైర్ జిల్లాలోని పుంగ్రో కిఫైర్ సీటుకు ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే తెలంగాణలోని దుబ్బాక అసెంబ్లీ స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో ఉప ఎన్నిక జరుగుతోంది. హర్యానాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే క్రిషన్ హుడా మరణం కారణంగా ఖాళీగా ఉన్న సోనిపట్‌లోని బరోడా స్థానానికి ఎన్నికలు జరిగాయి.
ఒడిశాలో టిర్టోల్, బాలాసోర్ అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలకు జరిగాయి. బీజేపీ ఎమ్మెల్యే మదన్ మోహన్ దత్తా, టిర్టోల్‌లో బీజేపీ ఎమ్మెల్యే బిష్ణు చరణ్ దాస్ మరణించడంతో ఆయా స్థానాలు ఖాళీ అయ్యాయి. జార్ఖండ్‌లో డుమ్కా, బెర్మో సీట్లకు ఎన్నికలు జరుగుతుండగా.. జేఎంఎం అధినేత, సీఎం హేమంత్ సోరెన్ డుమ్కా, బర్హైట్ స్థానాల్లో పోటీ చేయగా.. రెండుస్థానాల్లో విజయం సాధించడంతో డుమ్కా స్థానాన్ని వదులుకున్నారు.