నిరూపిస్తే  100 గుంజీలు తీస్తా : మమత సవాల్

కోల్‌కతా : ఈ ఏడాది దుర్గా పూజను రద్దు చేస్టున్నట్లు తాము ప్రకటించామంటూ వివిధ రాజకీయ పార్టీలు రకరకాల అవాస్తవాలను ప్రచారం చేస్తున్నాయని, వాటిని నిరూపిస్తే ప్రజల ముందు వంద గుంజీలు తీయడానికి సిద్ధంగా ఉన్నామని కోల్‌కతా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. అంతే కాకుండా.. ఈ విషయంలో సోషల్‌ మీడియా తప్పుడు వార్తలను ప్రచారం చేస్తోందని, ఇలా తప్పుడు వార్తలను ప్రచారం చేసే వారిని గుర్తించి వంద గుంజీలు తీయించండని పోలీసులను ఆదేశించారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలతో మత సహనం దెబ్బతింటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘దుర్గా పూజా విషయంలో రాజకీయ పార్టీ రకరకాలైన అవాస్తవాలను ప్రచారం చేస్తోంది. ఈ విషయంపై తాము ఎలాంటి సమావేశమూ పెట్టలేదు. ఈ యేడాది దుర్గా పూజను రద్దు చేస్తున్నట్లు తాము ప్రకటించామని నిరూపిస్తే ప్రజల ముందు వంద గుంజీలు తీయడానికి సిద్ధంగా ఉన్నాం.’’ అని మమతా బెనర్జీ ప్రకటించారు. ఈ విషయంలో సోషల్ మీడియా తప్పుడు వార్తలను ప్రచారం చేస్తోందని, ఇలా తప్పుడు వార్తలు ప్రచారం చేసే వారిని గుర్తించి, వంద గుంజీలు తీయించండని పోలీసులను సీఎం ఆదేశించారు. ఇలాంటి తప్పుడు ప్రచారంతో మత సహనం దెబ్బతింటోందని ఆమె మండిపడ్డారు. కాళీ, దుర్గా, హనుమాన్ పూజలు చేయని వారు కూడా పూజ గురించి మాట్లాడేస్తున్నారని సీఎం మమత మండిపడ్డారు.

Leave A Reply

Your email address will not be published.