పొంగల్‌ గిఫ్ట్‌: నిత్యవసరాలతోపాటు రూ.2,500 నగదు..

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ సారి పండుగ బహుమతిలో నగదును కూడా చేర్చారు. ఆ రాష్ట్ర ప్రజలకు బియ్యం, చక్కెర, పొడి ద్రాక్ష, జీడిపప్పు, ఏలకులు, చెరకుతో కూడిన బట్టల సంచిలో రూ.2,500 నగదు కూడా పొంగ‌ల్ గిఫ్ట్‌గా అంద‌జేస్తామ‌ని ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ప్రకటించారు. బియ్యం పొందే 2.06 కోట్ల మంది రేషన్ కార్డుదారులకు పొంగల్ గిఫ్ట్ హాంపర్లు అందజేస్తామని చెప్పారు. సేలం జిల్లాలోని తన అసెంబ్లీ నియోజకవర్గంలో శనివారం ఆయన ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గంలో ప్రాథమిక సౌకర్యాలను మెరుగుపర్చినట్లు తెలిపారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో పొంగల్‌ గిఫ్ట్‌ను ఎడప్పాడి పళనిస్వామి ప్రకటించారు.

Leave A Reply

Your email address will not be published.