బాబ్రీ కూల్చివేత నిందితులంతా నిర్దోషులే!

తీర్పు సారాంశం.. బాబ్రీ మ‌సీదు కూల్చివేత ముంద‌స్తు ప‌థ‌కం కాదు.. దితుల‌పై త‌గిన‌న్ని సాక్ష్యాధారాలు లేవు..
సీబీఐ స‌మ‌ర్పించిన ఆడియో, వీడియో స‌రిగా లేవు.. మ‌సీదు డోమ్ ఎక్కిన వారు సంఘ విద్రోహులు …
మ‌సీదు వ‌ద్ద మాట్లాడిన ఆడియో ప్ర‌సంగం స్ప‌ష్టంగా లేదు.

 

ల‌ఖ్‌న‌పూ: ఎన్నో ఏళ్ల నుంచి ఉత్కంఠ‌గా ఎదురుచూస్తోన్న బాబ్రీ మ‌సీదు కూల్చివేత కేసుకు ఎట్ట‌కేల‌కు తెర‌ప‌డింది. ఈ కేసుపై ల‌క్నోలోని సీబీఐ కోర్టు తీర్పును బుధ‌వారం వెలువ‌రించింది. బాబ్రీ మ‌సీదు కూల్చివేత ముందుగా అనుకున్న ప‌థ‌కం ప్ర‌కారం చేసింది కాదు అని కోర్టు తీర్పునిచ్చింది. 2000 పేజీల తీర్పును న్యాయ‌మూర్తి సురేంద్ర కుమార్ యాద‌వ్ చ‌దివి వినిపించారు. దీంతో ప్రధాన నిందితులుగా అభియోగాలు ఎదుర్కొంటున్న ఎల్కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతీ సహా 32 మంది నిందితులు నిర్దోషులుగా తేలారు. ఇవాళ ల‌క్నో కోర్టులో బాబ్రీ మ‌సీదు కూల్చివేత విచార‌ణ జ‌రిగింది. 32 మంది నిందితుల్లో 26 మంది కోర్టుకు హాజ‌ర‌య్యారు. ఆరుగురు హాజ‌రుకాలేదు. హాజ‌రుకాని వారిలో అద్వానీ, జోషీ, ఉమాభార‌తిలు ఉన్నారు. 1992, డిసెంబ‌ర్ 6వ తేదీన అయోధ్య‌లోని బాబ్రీ మ‌సీదును ధ్వంసం చేసిన విష‌యం తెలిసిందే. ఆ కేసులో ఇవాళ ల‌క్నో సీబీఐ కోర్టు తీర్పునిచ్చింది. అయితే బాబ్రీని కూల్చిన‌వాళ్లు సంఘ‌వ్య‌తిరేకులు అని ఇవాళ కోర్టు త‌న తీర్పులో పేర్కొన్న‌ది.

 

మ‌సీదు కూల్చివేత స‌మ‌యంలో అక్క‌డ ఉన్న నేత‌లంతా .. ఆగ్ర‌హంతో ఉన్న జ‌నాల్ని అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశార‌ని న్యాయ‌మూర్తి ఎస్‌కే యాద‌వ్ తెలిపారు. భారీ జ‌న‌స‌మూహాన్ని రెచ్చ‌గొట్టే విధంగా ఎవ‌రూ ప్ర‌వ‌ర్తించ‌లేద‌ని తీర్పులో పేర్కొన్నారు. వివాదాస్పద ప్రాంతానికి వెనుక భాగం నుంచి రాళ్లు రువ్వ‌డం జ‌రిగింద‌న్నారు. మ‌సీదు స‌మీపంలో హిందూ దేవ‌తామూర్తుల విగ్ర‌హాల ఉన్నాయ‌ని, అందుకే ఆ ప్రాంతాన్ని సుర‌క్షితంగా ఉంచేందుకు అశోక్ సింఘాల్ ప్ర‌య‌త్నించిన‌ట్లు జ‌డ్జి యాద‌వ్ తెలిపారు.

బాబ్రీ మసీదు తీర్పు నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం చేసిన విషయం తెలిసిందే. 1992 డిసెంబర్‌ 6న అయోధ్యలో బాబ్రీ మసీదును కరసేవకులు కూల్చివేశారు. మొత్తం 48 మందిపై అభియోగాలు నమోదు కాగా.. దర్యాప్తు సమయంలో 17మంది మృతి చెందారు. 2009లో నివేదిక లిబర్హన్‌ కమిషన్ సమర్పించారు. మసీదు కూల్చివేత వెనుక కుట్ర ఉన్నట్లు కమిషన్ తేల్చింది. వెయ్యి మందికిపైగా సాక్షుల వాంగ్మూలాలను సీబీఐ నమోదు చేసింది. సుధీర్ఘకాలం విచారించిన అనంత‌రం ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న వారంతా నిర్ధోషులుగా తేలుస్తూ సిబిఐ ప్ర‌త్యేక న్యాయ‌స్థానం తాజాగా తీర్పు చెప్పింది.

Leave A Reply

Your email address will not be published.