బీహార్‌ మాజీ సిఎం కన్నుమూత

పాట్నా: బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి సతీష్‌ ప్రసాద్‌ సింగ్‌(90) కరోనాతో సోమవారం ఢిల్లీ ఆస్పత్రిలో కన్నుమూశారు. అదే ఆస్పత్రిలో ఆయన భార్య ఐదు రోజుల క్రితమ మరణించారు. 1968లో ఆయన ముఖ్యమంత్రిగా కేవలం ఐదు రోజులు మాత్రమే పనిచేశారు. ఆ ఏడాది జనవరి 28 నుంచి ఫిబ్రవరి 1 వరకూ సిఎంగా ఉన్నారు. కాంగ్రెస్‌తో పాటు కొత్తగా ఏర్పడిన షోషిత్‌ సమాజ్‌ దళ్‌ సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించారు. 2013 సెప్టెంబర్‌ 22న బిజెపిలో చేరిన సింగ్‌… లోక్‌సభ ఎన్నికల్లో కుష్వాహ కమ్యూనిటీకి సరైన ప్రాతినిధ్యం ఇవ్వనందుకు నిరసనగా ఆ తర్వాత రాజీనామా చేశారు.

Leave A Reply

Your email address will not be published.