భ‌ర్త‌ను చంపినా.. ఆ భార్య‌కు పెన్ష‌న్ ఇవ్వాల్సిందే: పంజాబ్‌, హ‌ర్యానా హైకోర్టు

చండీగ‌ఢ్‌: ఎవ‌రైన స‌ర్కార్ ఉద్యోగ‌స్తుడు చ‌నిపోతే అత‌ని భార్య‌కు ఫెన్ష‌న్ ఇస్తారు.కానీ ఆ భార్యే త‌న క‌ట్టుకున్న భ‌ర్త‌ను క‌డ‌తేరిస్తే.. అది రుజువైతే.. ఇచ్చేదే లేద‌ని తేల్చి చెప్పింది హ‌ర్యానా ప్ర‌భుత్వం. ఈ విష‌యంలో స‌ర్కార్ నిర్ణ‌యాన్ని త‌ప్పుబ‌డుతూ.. వాళ్ల ఆదేశాల‌ను పంజాబ్‌, హ‌ర్యానా హైకోర్టు కొట్టేసింది. త‌న భ‌ర్త‌ను భార్యే చంపింద‌ని తెలిసినా.. స‌ద‌రు భార్య‌కు రావాల్సిన ఫ్యామిలీ పెన్ష‌న్ ఆమెకు ఇవ్వాల్సిందేన‌ని కోర్టు ఈ సంద‌ర్భంగా స్ప‌ష్టం చేసింది.

కాగా భ‌ర్త‌ను హ‌త్య చేసిన కేసులో దోషిగా తేలిన బ‌ల్జీత్ కౌర్ అనే మ‌హిళ వేసిన పిటిష‌న్ విచారించిన అనంత‌రంల కోర్టు ఈ తీర్పు వెలువ‌రించింది. తాజా విచార‌ణ‌లో హ‌ర్యానా ప్ర‌భుత్వ ఆదేశాల‌ను కొట్టేసిన కోర్టు.. సంబంధిత శాఖ‌కు పూర్తి బ‌కాయిల‌తోపాటు ఇక నుంచి పెన్ష‌న్ చెల్లించాల‌ని ఆదేశించింది.

అలాగే ఓ ప్ర‌భుత్వ ఉద్యోగి చ‌నిపోయిన త‌ర్వాత అత‌ని కుటుంబానికి ఆర్థిక సాయం ఇవ్వ‌డానికి ఫ్యామిలీ పెన్ష‌న్ అనే ఈ వెల్ఫేర్ స్కీమ్‌ను తీసుకొచ్చార‌ని కోర్టు స్ప‌ష్టం చేసింది. అందువ‌ల్ల భార్య ఓ క్రిమిన‌ల్ కేసులో దోషిగా తేలినా ఫ్యామిలీ పెన్ష‌న్ ఇవ్వాల్సిందే అని కోర్టు స్ప‌ష్టం చేసింది. కాగా సీసీఎస్‌ రూల్స్‌, 1972 ప్ర‌కారం భ‌ర్త చ‌నిపోయిన త‌ర్వాత కూడా భార్య‌కు పెన్ష‌న్ ఇస్తారు. భ‌ర్త మ‌ర‌ణం త‌ర్వాత రెండో పెళ్లి చేసుకున్నా కూడా ఆమె పెన్ష‌న్ పొంద‌డానికి అర్హురాలే.

Leave A Reply

Your email address will not be published.