థియేట‌ర్ల‌కు శుభ‌వార్త‌.. ఇక నూరుశాతం ఆక్యుపెన్సీ

న్యూఢిల్లీ: ఫిబ్ర‌వ‌రి 1 నుంచి 100 శాతం ఆక్యుపెన్సీతో థియేట‌ర్లు న‌డుపుకోవ‌చ్చ‌ని కేంద్ర స‌మాచార‌, ప్ర‌సారాల మంత్రిత్వ శాఖ‌ కొత్త మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జారీ చేసింది. సినిమాలు, థియేట‌ర్లు, మ‌ల్టీప్లెక్స్‌ల‌లో 100 శాతం సీట్ల‌ను నింపుకోవ‌డానికి అనుమ‌తి ఇస్తున్న‌ట్లు అందులో స్ప‌ష్టం చేసింది. అలాగే భౌతిక దూరం, మాస్కులు, శానిటైజ‌ర్లు, టెంప‌రేచ‌ర్ చెకింగ్‌లు, షో టైమింగ్స్‌, బుకింగ్స్‌లో మార్పులు చేయాల‌ని కేంద్రం విడుద‌ల చేసిన మార్గ‌ద‌ర్శకాల్లో స్ప‌‌ష్టంగా పేర్కొంది. కాగా గ‌తేడాది అక్టోబ‌ర్‌లోనే కేవ‌లం 50 శాతం కెపాసిటీతోనే థియేటర్లు తెరుచుకోవ‌డానికి అనుమ‌తి ఉండేది. దీంతో థియేట‌ర్ల ఓన‌ర్లు తాము న‌ష్టాల పాల‌వుతున్న‌ట్లు చెప్పారు. దాంతో కేంద్రం తాజాగా నూరు శాతం అక్యుపెన్సీతో థియేట‌ర్లు న‌డుపుకోవ‌డానికి అనుమ‌తి ఇచ్చింది.

Leave A Reply

Your email address will not be published.