మహారాష్ట్రలో కొత్త‌గా 8,623 కరోనా కేసులు

ముంబ‌యి: మహా­రా­ష్ట్రలో కరోనా వైరస్ రోజురోజుకీ విజృంభిస్తోంది. గ‌డిచిన శుక్రవారం నుంచి శనివారం వరకు కొత్తగా 8,623 కరోనా కేసులు న‌మోద‌య్యాయి. అలాగే కొత్త‌గా 51 మంది మ‌ర‌ణించారు. ఈ మేర‌కు రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ శ‌నివారం సాయంత్రం బులిటెన్ విడుద‌ల చేసింది. తాజా కేసుల‌తో క‌లిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 21,46,777కి చేరింది. అలాగే రాష్ట్రంలో మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 52,092కు చేరింది. గత 24 గంటల్లో 3,648 మంది కరోనా రోగులు కోలుకున్నారు.ప్రస్తుతం 72,530 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నట్లు పేర్కొంది. కాగా, కరోనా కేసుల నమోదు ఎక్కువగా ఉన్న అమరావతి, అచల్‌పూర్‌లో లాక్‌డౌన్‌ను మార్చి 8 వరకు పొడిగించారు.

Leave A Reply

Your email address will not be published.