మహేష్‌ బాబుతో వంశీ పైడిపల్లి వెబ్‌ సిరీస్‌?

మ‌హేష్ అభిమానుల‌కు చిర‌కాలం గుర్తుండే సినిమా `మ‌హ‌ర్షి`. ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు వంశీ పైడిపల్లి. మ‌ళ్లీ మహేష్‌తో మరో సినిమా తీసేందుకు కథ సిద్ధం చేసుకున్నాడు పైడిప‌ల్లి. అయితే కొన్ని కారణాల వల్ల ఆ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లలేదు. కాగా ప్రస్తుతం మహేష్‌బాబు ‘గీత గోవిందం’ ఫేమ్‌ దర్శకుడు పరుశురామ్‌తో ‘సర్కారి వారి పాట’ చిత్రం చేస్తున్నాడు. వచ్చే నెలలో షూటింగ్‌లో పాల్గనే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా ప్రస్తుతం వంశీ ఖాళీగా ఉన్నారు. మహేష్‌తో మరోసారి ఎలాగైనా సినిమా తీయాలనే ఆలోచనలో ఉన్నట్లు ఈ మ‌ధ్య‌నే వంశీ పైడిపల్లి వెల్లడించాడు. అయితే వారి కాంబినేషన్‌లో సినిమా మొదలవ్వడానికి ముందు వీరిద్దరి కలయికలో ఓ వెబ్‌ సిరీస్‌ తెరకెక్కబోతోందట! మహేష్‌ బాబు నిర్మాణ సంస్థ కోసం వంశీ ఓ వెబ్‌ సిరీస్‌ను రూపొందించబోతున్నాడని సమాచారం. అంతేకాదు ఈ వెబ్‌ సిరీస్‌లో పలువురు ప్రముఖ నటులు నటించబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం వెబ్‌ సిరీస్‌ల జోరు కొనసాగుతుండటంతో మహేష్‌ నిర్మాణ సంస్థ వెబ్‌ సిరీస్‌లపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. చూడాలి పెద్ద‌స్ర్కీన్‌మీద అభిమానుల‌ను అల‌రించిన మ‌హేష్ వెబ్ సిరీస్‌లో ఎలా క‌నిపిస్తాడో అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.