రాజస్థాన్ మున్సిపల్ ఎన్నికల్లో సత్తాచాటిన కాంగ్రెస్

జైపూర్: రాజస్థాన్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. 12 జిల్లాలోని 50 మున్సిపాలిటీ సంస్థల్లోని (43 మున్సిపాలిటీలు, 7 సిటీ కౌన్సిల్స్) 1,775 వార్డులకు జరిగిన ఎన్నికల్లో 620 వార్డులను కైవసం చేసుకొని అధికార పార్టీ ఆధిపత్యం ప్రదర్శించింది. 548 స్థానాలను గెలిచి బీజేపీ రెండో స్థానంలో నిలువగా బీఎస్పీ 7 చోట్ల, సీపీఐ, సీపీఎం రెండు చొప్పున, ఆర్ఎల్పీ ఓ చోట విజయం సాధించాయి. ఎన్నికల్లో 595 మంది స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందడం విశేషం. ఎన్నికల్లో ఈ సారి భారీగా పోలింగ్ శాతం నమోదైంది. దాదాపు 79.90 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారి అయుక్త పీఎస్ మిశ్రా తెలిపారు. ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ శుభాకాంక్షలు తెలిపారు.