రాష్ట్రంలో ప్రతిపక్షం ఉండదు: ఎమ్మెల్సీ తోట

మండపేట (CLiC2NEWS): రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ  పథకాలతో రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది ఉండదని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. ఎమ్మెల్సీ పదవి చేపట్టి తొలిసారిగా జిల్లాకు విచ్చేసిన త్రిమూర్తులకు అడుగడుగున ఘనస్వాగతం లభించింది. మంగళవారం ఉదయం కోనసీమ ముఖద్వారం రావులపాలెంలో జిల్లాలోని పలు ప్రాంతాల నుండి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తోట త్రిమూర్తులు అభిమానులు భారీ ఎత్తున స్వాగతం పలికారు. రావులపాలెంలో కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో స్వాగతం పలికి క్రేన్ తో గజ మాలలు వేశారు. అనంతరం అక్కడ వైయస్సార్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం అక్కడ నుంచి జాతీయ రహదారి మీదుగా జొన్నాడ చేరుకోగా అక్కడ ఆలమూరు మండల నాయకులు ఘన స్వాగతం పలికారు.

అనంతరం మండపేట బైపాస్ రోడ్ లోని టోల్ గేట్ సెంటర్ నుండి కార్లు, బైక్ ర్యాలీతో త్రిమూర్తులు మండపేట పట్టణంలోకి చేరుకున్నారు. కలువ పువ్వు సెంటర్ లో భారీ ఎత్తున బాణాసంచా కాల్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ త్రిమూర్తులు మాట్లాడారు దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. ఈ పథకాల అమలుతో ఇక రాష్ట్రంలో రెండో పార్టీ అనేది ఉండదని తెలిపారు. అక్కడినుంచి రాజారత్న సెంటర్ చేరుకుని దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ సీనియర్ నాయకులు వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి , వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు , రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి రెడ్డి రాధాకృష్ణ , స్థానిక సంస్థల ఎన్నికల పరిశీలకులు మిండుగుదిటీ మోహన్ , ఏఎంసీ చైర్మన్ తేతలి వనజారెడ్డి పట్టణ వైసీపీ కన్వీనర్ ముమ్మిడివరపు బాపిరాజు, వైసీపీ పట్టణ కార్యదర్శి టపా పుల్లేశ్వరరావు, శిరంగు శ్రీనివాస్, గంగుమళ్ళ శ్రీనివాస్, వివిధ వార్డుల్లో కౌన్సిలర్లు , వివిధ గ్రామాల సర్పంచులు తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.