రిపబ్లికన్‌ టివి సిఈఓ అరెస్ట్‌

ముంబయి: నకిలీ టిఆర్‌పి రేటింగ్‌ కుంభకోణంలో రిపబ్లికన్‌ టివి సిఇఓ వికాస్‌ కంచన్‌దాన్‌ను ముంబయి పోలీసులు అరెస్ట్‌ చేశారు. తమ ఉద్యోగులను అరెస్ట్‌ చేయవద్దంటూ టివి యాజమాన్యం వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్ట్‌ తిరస్కరించిన వారం రోజుల తర్వాత ఈ అరెస్ట్‌ చేశారు. ఈకేసులో ఇప్పటి వరకు వికాస్‌తో కలిపి 13 మందిని అరెస్ట్‌ చేశారు. హన్సా రీసెర్చ్‌ సంస్థ నుండి నితిన్‌ దియోకర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు అక్టోబర్‌ ఆరో తేదీన ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో 140 మందిని సాక్ష్యులుగా చేర్చారు.

గ‌త అక్టోబ‌ర్ నెల‌లో ఈ న‌కిలీ టీఆర్పీ స్కామ్ వెలుగులోకి వ‌చ్చింది. కొన్ని టీవీ చానెళ్లు రేటింగ్స్‌ను తారుమారు చేస్తున్నాయంటూ రేటింగ్స్ ఏజెన్సీ బ్రాడ్‌కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్‌) ఫిర్యాదు చేసింది. టీవీ చానెళ్ల‌కు వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లు రావ‌డంతో ఈ టీఆర్పీలే కీల‌కం. దీంతో న‌కిలీ రేటింగ్స్‌ను సృష్టించి ప్ర‌క‌ట‌న‌ల‌ను ఆక‌ర్షించ‌డానికి కొన్ని టీవీ చానెళ్లు ఇలా న‌కిలీ టీఆర్పీ స్కామ్‌కు తెర‌తీశాయి. రేటింగ్ మీట‌ర్లు ఉన్న ఇళ్ల‌లో ఉన్న వాళ్ల‌కు లంచాలు ఇచ్చి.. త‌మ చానెలే చూసే విధంగా రిప‌బ్లిక్ టీవీ ప్రోత్స‌హించింద‌ని పోలీసులు త‌మ విచార‌ణ‌లో తేల్చారు.

Leave A Reply

Your email address will not be published.