రైతులు టెర్రరిస్టులు కాదు: ధ‌ర్నాలో ప్ల‌కార్డును ప్ర‌ద‌ర్శించిన కెటిఆర్‌

హైద‌రాబాద్: కేంద్రం తీసుకువ‌చ్చిన వ‌్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేర‌కు టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున భార‌త్ బంద్‌లో పాల్గొంటున్నారు. షాద్‌న‌గ‌ర్ వ‌ద్ద బూర్గుల టోల్‌గేట్ వ‌ద్ద టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి శ్రీనివాస్ గౌడ్‌, రాజ్య‌స‌భ స‌భ్యులు కేశ‌వ‌రావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు ప‌లువురు నాయ‌కులు భార‌త్ బంద్‌లో పాల్గొన్నారు. రైతులు టెర్ర‌రిస్టులు కాదు అనే ప్ల‌కార్డును కేటీఆర్ ప్ర‌ద‌ర్శించారు. టీఆర్ఎస్ ప్ర‌భుత్వం రైతుల‌కు మ‌ద్ద‌తుగా ఉంటుంద‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ ఆందోళ‌న‌లు

అలంపూర్ వ‌ద్ద జాతీయ ర‌హ‌దారిపై మంత్రి నిరంజ‌న్ రెడ్డి, తూప్రాన్‌ వద్ద మంత్రి హరీశ్‌రావు, హైదరాబాద్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, హన్మకొండ-వరంగల్‌ హైవేపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, పెద్దపల్లి జిల్లా ధర్మారం, జగిత్యాల జిల్లాలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌, కామారెడ్డి శివారులోని ఎల్లారెడ్డి పరిధిలోని టెక్రియాల్‌ వద్ద ఎమ్మెల్సీ కవిత నిరసనలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.