‘రైతు బంధు’గా ఆర్. నారాయణమూర్తి

మరోసారి రైతు సమస్యలను ఆర్. నారాయణమూర్తి వెండితెరపై ఆవిష్కరించబోతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల చేసిన రైతు చట్టం వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే పార్లమెంట్ ఆమోదం పొందిన ఈ చట్టాన్ని రద్దు చేయాలంటూ దేశ రాజధానిలో వేలాది మంది రైతులు రోడ్లపై బైఠాయించి, తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ చట్టంలోని లోటు పాట్లను తెలియచేస్తూ ఆర్. నారాయణమూర్తి తాజాగా ‘రైతుబంధు’ పేరుతో సినిమాను రూపొందించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. అతి త్వరలోనే ఈ సినిమాను జనం ముందుకు తీసుకొస్తానని నారాయణమూర్తి తెలిపారు.