వైద్య ఉద్యోగుల సేవలకు సెల్యూట్: ఢిల్లీ సిఎం కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఓ వీడియో సందేశంలో మాట్లాడుతూ… ‘కరోనా మహమ్మారి సమయంలో వైద్య ఉద్యోగులు చేసిన సేవలకు గుర్తింపుగా వారికి సెల్యూట్ చేస్తున్నాను. అలాగే 2020కి వీడ్కోలు పలుకుతూ.. కోవిడ్ -19 వార్నింగ్ బెల్ అని.. సున్నితత్వంతో ఉండకుండా.. ఎటువంటి దాన్నైనా ఎదుర్కొనేలా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను’ అంటూ తన సందేశంలో తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దేశ ప్రజలకు ట్విట్టర్ ద్వారా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.