శ‌త్రువుకు వెన్నులో వ‌ణుకు పు‌ట్టిస్తున్న ర‌ఫెల్‌

చంఢీగ‌ర్ :భార‌త వాయుసేన‌లోకి ర‌ఫెల్ చేరిక‌ యావ‌త్ ప్ర‌పంచానికి అతి పెద్ద‌, క‌ఠిన సందేశాన్ని ఇస్తుంద‌ని రాజ్‌నాథ్ తెలిపారు. మ‌న సార్వ‌భౌమ‌త్వంపై క‌న్నువేసిన వారికి ఈ యుద్ధ‌విమానాలు వ‌ణుకు పుట్టిస్తాయ‌ని ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్న‌రు. అంబాలా ఎయిర్ ఫోర్స్ స్టేష‌న్‌లో ర‌ఫెల్‌ యుద్ధ విమానాల ఇండ‌క్ష‌న్ సెర్మ‌నీ గురువారం వైభ‌వంగా జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడారు. ర‌ఫెల్‌ రాక‌తో భార‌త్‌, ఫ్రాన్స్ మ‌ధ్య బంధం బ‌లోపేత‌మైంద‌న్నారు. రెండు దేశాల మ‌ధ్య వ్యూహాత్మ‌క సంబంధాలు కూడా బ‌ల‌ప‌డ్డాయ‌న్నారు. ర‌ఫెల్‌ కోసం ఎన్నో అవాంత‌రాలు ఏర్ప‌డ్డాయ‌ని, కానీ ప్ర‌ధాని మోదీ బ‌ల‌మైన కాంక్ష వ‌ల్ల ఇది సాధ్య‌మైందన్నారు. స్వేచ్ఛ, స‌మాన‌త్వం, సోద‌ర‌భావం, వ‌సుదైక కుటుంబం అన్న సూత్రాల‌కు రెండు దేశాలు క‌ట్టుబ‌డి ఉన్న‌ట్లు ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ తెలిపారు. ఈ సూత్రాల‌నే రెండు దేశాలు ప్ర‌పంచ‌వ్యాప్తం చేస్తున్నాయ‌న్నారు. భార‌త స్వాతంత్ర్యం త‌ర్వాత రెండు దేశాల మ‌ధ్య సంబంధాలు మ‌రింత మెరుగుప‌డిన‌ట్లు చెప్పారు. ర‌ఫెల్ ఇండ‌క్ష‌న్ కార్య‌క్ర‌మంలో ఫ్రాన్స్ ర‌క్ష‌ణ మంత్రి ఫ్లోరెన్స్ పాల్గొన‌డం రెండు దేశాల మ‌ధ్య బ‌ల‌మైన ర‌క్ష‌ణ భాగ‌స్వామ్యాన్ని గుర్తు చేస్తోంద‌న్నారు. ప్ర‌పంచ శాంతి కాంక్ష‌తోనే తాము త‌మ ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేస్తున్న‌ట్లు రాజ్‌నాథ్ తెలిపారు. శాంతియుత వాతావ‌ర‌ణాన్ని దెబ్బ‌తీసే విధంగా తాము ఎప్పుడూ ప్ర‌వ‌ర్తించ‌బోమ‌న్నారు. గోల్డెన్ యారోస్ స్క్వాడ్ర‌న్‌లో రాఫేళ్లు ఓ మెరుపులా మెరుస్తాయ‌ని ఆయ‌న ఆశాభావం వ్య‌క్తం చేశారు.     (ఎయిర్‌ఫోర్స్‌లోకి 5 రఫెల్‌ యుద్ధ విమానాలు)

ప్ర‌స్తుతం స‌రిహ‌ద్దుల్లో ఉన్న వాతావ‌ర‌ణాన్ని దృష్టిలో పెట్టుకుంటే, ఈ ఇండ‌క్ష‌న్ ఎంతో కీల‌క‌మైంద‌న్నారు. ఇటీవ‌ల తాను విదేశీ టూర్‌కు వెళ్లాన‌ని, అక్క‌డ భార‌త్ అభిప్రాయాన్ని సుస్ప‌ష్టం చేసిన‌ట్లు రాజ్‌నాథ్ తెలిపారు. ఎటువంటి ప‌రిస్థితుల్లో త‌మ భూభాగాన్ని వ‌దులుకునేది లేద‌ని తేల్చిచెప్పిన‌ట్లు గుర్తు చేశారు. భార‌తీయ వాయుద‌ళానికి కంగ్రాట్స్ చెబుతున్నాన‌ని, కానీ స‌రిహ‌ద్దుల్లో ఉన్న ప‌రిస్థితులు దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని, ఎల్ఏసీ వ‌ద్ద మీరు చేప‌ట్టిన చ‌ర్య‌లు మీరెంత క‌ట్టుబ‌డి ఉన్నారో చెబుతుంద‌ని రాజ్‌నాథ్ తెలిపారు. ఫార్వ‌ర్డ్ బేస్‌ల వ‌ద్ద ఐఏఎఫ్ ద‌ళాలు చాలా వేగంగా త‌మ ఆయుధ సంప‌త్తిని చేర్చాయ‌ని, దీంతో వాయుద‌ళం ఎంత సంసిద్ధంగా ఉందో తెలుస్తోంద‌న్నారు.

 


ఈ సంద‌ర్భంగా ఫ‌్రాన్స్ ర‌క్ష‌ణ‌మంత్రి ఫ్లోరెన్స్ పార్లే ప్ర‌సంగిస్తూ… మేక్ ఇన్ ఇండియాకు కూడా స‌హ‌క‌రించేందుకు ఫ్రాన్స్ క‌ట్టుబ‌డి ఉంద‌న్నారు. ఫ్రెంచ్ ప‌రిశ్ర‌మ‌ల‌కు మేక్ ఇన్ ఇండియా ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్నారు. ముఖ్యంగా ర‌క్ష‌ణ ఉత్ప‌త్తుల‌కు ఇది చాలా అవ‌స‌రం అన్నారు. రెండు దేశాల మ‌ధ్య స్నేహ‌బంధం బ‌ల‌ప‌డింద‌న్నారు. రెండు దేశాల‌కు ఇవాళ ఘ‌న‌త సాధించిన రోజు అని, ర‌ఫేల్స్‌తో ఇరు దేశాల మ‌ధ్య‌ కొత్త ర‌క్ష‌ణ బంధం ఏర్ప‌డిన‌‌ట్లు చెప్పారు. అత్యాధునిక ర‌ఫేల్ విమానాల‌తో భార‌తీయ సామ‌ర్ధ్యం పెరిగిన‌ట్లు ఆమె తెలిపారు.

 

 

ర‌ఫెల్ ప్ర‌త్యేక‌త‌లు

  • వాయుసేన‌లో అత్యాధునిక‌మైన‌ది ర‌ఫెల్‌..

  • ఫ్రెంచ్ ప‌దం రాఫేల్‌కు అర్థం తుఫాన్‌.

  • ఇవి ఫోర్త్ జ‌న‌రేష‌న్ యుద్ధ విమానాలు.

  • ట్విన్ ఇంజిన్‌, డెల్టా వింగ్ వీటి ప్ర‌త్యేకం.

  • ఈ యుద్ధ విమానాలను అణుదాడుల్లోనూ వాడ‌వ‌చ్చు.

  • ఈ యుద్ధ విమానాల్లో అత్యాధునిక వెప‌న్స్ కూడా ఉన్నాయి.

  • 30ఎఎం కెనాన్ వీటిల్లో ఉంటుంది. 12 రౌండ్లు పేల్చ‌గ‌ల‌వు.

  • ఒక్కొక్క‌టి దాదాపు వెయ్యికిలోల స‌రుకును మోసుకువెళ్ల‌గ‌ల‌వు.

  • ప్ర‌మాద స‌మ‌యంలో.. వీటిల్లో రేడార్ వార్నింగ్ వ్య‌వ‌స్థ అత్య‌ద్భుతంగా ప‌నిచేస్తుంది.

  • లేజ‌ర్ వార్నింగ్మి, స్సైళ్ల వార్నింగ్ కూడా ఉంది.

  • రేడార్లు జామ్ కూడా ఉండేందుకు కావాల్సిన సాంకేతికత‌ కూడా ఈ విమానాల్లో ఉన్న‌ది.

  • వంద కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న టార్గెట్‌ను రాఫేల్ రేడార్ సిస్ట‌మ్ గుర్తించ‌గ‌ల‌దు.

  • గాలిలో సుమారు 150 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న టార్గెట్‌ను ఈ మిస్సైళ్ల‌ను పేల్చ‌గ‌ల‌వు.

  • ఆకాశం నుంచి నేల మీద ఉన్న టార్గెట్ల‌ను పేల్చే శ‌క్తి కూడా రాఫేల్‌కు ఉన్న‌ది.

Leave A Reply

Your email address will not be published.