సీబీఎస్‌ఈ 10, 12 పరీక్షల షెడ్యూల్ విడుదల

హైదరాబాద్: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) 10, 12వ తరగతుల పరీక్షల షెడ్యూల్‌ను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోక్రియాల్ మంగళవారం ప్రకటించారు. మే 4వ తేదీ నుంచి జూన్ 10వ తేదీ వరకు పరీక్షల నిర్వహణ జరగనున్నట్లు వెల్లడించారు. మే 4 నుంచి జూన్ 7 వరకు 10వ తరగతి పరీక్షలను నిర్వహించనున్నారు. అదేవిధంగా మే 4 నుంచి జూన్ 11వ తేదీ వరకు 12వ తరగతి పరీక్షల నిర్వహణ. మార్చి 1 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు. జులై 15 తేదీలోగా సీబీఎస్‌ఈ ఫలితాలను విడుదల చేయనుంది.