సూర్యపై మద్రాస్‌ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

చెన్నై: నీట్‌ పరీక్షలపై తమిళ హీరో సూర్య శివకుమార్‌ చేసిన వ్యాఖ్యలను మద్రాస్‌ హైకోర్టు కొట్టిపారేసింది. ఈ వ్యాఖ్యలు అనసరమైనవని, వీటిపై ధిక్కార చర్యలు ఉండవని మద్రాస్‌ హైకోర్టు జడ్జి బాలసుబ్రహ్మణ్యమ్‌ స్పష్టం చేశారు. కరోనా మహమ్మారి సమయంలో నీట్‌ పరీక్షలు నిర్వహించడంతో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై హీరో సూర్య చేసిన ట్వీట్లు కోర్టు ధిక్కరణ కింద పేర్కొంటూ పిటిషన్‌ దాఖలైన సంగతి తెలిసిందే. విద్యార్థుల ఆత్మహత్యలు బాధాకరమని, వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విద్యార్థులను పరీక్షలు రాసేందుకు వెళ్లమనడం సరికాదని అన్నారు. అయితే, సూర్య వ్యాఖ్యలు అనవసరమైన, సమర్థనీయం కానివని పేర్కొంది. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో న్యాయ వ్యవస్థ ప్రజా స్వామ్య పరిరక్షణకు, ప్రజా శ్రేయస్సు కోసం పనిచేస్తోందని వెల్లడించింది. తమ పనితీరును తక్కువ చేసి మాట్లాడటం తగదని హితవు పలికింది.

(సూర్యపై కోర్టు ధిక్కరణ కేసు..)

Leave A Reply

Your email address will not be published.