ఒకటికాదు, వంద కాదు ఏకంగా 1400 కిలోల బంగారం స్వాధీనం..
చెన్నై (CLiC2NEWS): తమిళనాడులోని శ్రీపెరంబుదూర్ – కుండ్రత్తూర్ రహదారిలో ప్లయింగ్ స్క్వాడ్ చేపట్టిన తనిఖీలలో ఏకంగా 1400 కిలోల బంగారం . శనివారం చేపటటిన తనిఖీలలో ప్రైవేటు సెక్యూరిటి సంస్థకు చెందిన మిని లారీ, మిని కంటెయినర్ లారీలను సోదా చేయగా.. ఒక దానిలో 1000 కిలోలు, మరో వాహనంలో 400 కిలోల బంగారం గుర్తించారు. ఈ మొత్తం బంగారాన్ని చెన్నై విమానాశ్రయం నుండి శ్రీపెరంబుదూర్ సమీప మన్నూర్లని ఓ గాదామునకు తలిస్తున్నట్లు తెలిసింది. ఈ మొత్తం బంగారంలో 400 కిలోలకు ఆధారాలు ఉన్నాయి. మిగిలిన 1000 కిలోల బంగారానికి ఆధారాలు లేనట్టు సమాచారం.
ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ముమ్మర తనిఖీలు చేపట్టింది. దీనిలో భాగంగా మార్చి 1 నుండి ఇప్పటివరకు రోజుకు రూ. 100 కోట్ల విలువైన నగదు సీజ్ చేస్తున్నట్లు ఇసి వెల్లడించింది. మొత్తంగా రూ. 4650 కోట్లను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది.