20 టూరిస్ట్ పోలీసు స్టేషన్లను ప్రారంభించిన సిఎం జగన్

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక ప్రదేశాల్లో టూరిస్ట్ పోలీస్ స్టేషన్ల ఏర్పాటు చేయనుంది. రాష్ట్రం వ్యాప్తంగా 20 టూరిస్ట్ పోలీసు స్టేషన్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వర్చువల్ గా ప్రారంభించారు. పర్యాటకుల భద్రత దృష్ట్యా వీటిని ఏర్పాటు చేసినట్లు.. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఇది మరో మంచి కార్యక్రమమని సిఎం తెలిపారు. అదేవిధంగా పోలీసు వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చామని.. పోలీసులు మీ స్నేహితులే అనే భావనను కలిగించగలిగామని అన్నారు. పోలీస్ స్టేషన్లలో రిసెప్షనిస్టులను నియమించి తోడుగా నిలిచే కార్యక్రమం చేపట్టామని తెలిపారు. అనంతరం విశాఖ ఆర్కె బీచ్‌లో ఏర్పాటు చేసిన పోలీస్ బూత్‌ను సిఎం వర్చువల్‌గా ప్రారంభించారు. దీంతోపాటు 10 మోటార్ వెహికల్స్, రెండు పెట్రోలింగ్ వాహనాలను సిఎం ప్రారంభించారు.