సిమెంట్ కార్పొరేష‌న్ ఆప్ ఇండియా , న్యూఢిల్లిలో 29 పోస్టులు..

CCILTD: ఇంట‌ర్వ్యూ ఆధారంగా న్యూఢిల్లీలోని సిమెంట్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (CCILTD) లో 29 పోస్టుల‌ను ఒప్పంద ప్రాతిప‌దిక‌న భ‌ర్తీ చేయ‌నున్నారు. దీనికోసం అర్హులైన అభ్య‌ర్థుల నుండి ద‌ర‌ఖాస్తులు కోరుతున్నారు. మొత్తం పోస్టులు 29 క‌ల‌వు.

ఇంజినీర్ (ప్రొడ‌క్ష‌న్‌) -7
ఇంజినీర్ (మెకానికల్) 2
ఇంజినీర్ (సివిల్) 1
ఇంజినీర్ (మైనింగ్ ) 4
ఇంజినీర్ (ఇన్‌స్ట్రుమెంటేష‌న్) -4
ఇంజినీర్ (ఎల‌క్ట్రిక‌ల్ ) -2

ఆఫీస‌ర్ (మెటీరియ‌ల్ మేనేజ్‌మెంట్ )-2
ఆఫీస‌ర్ (మార్కెటింగ్)-1
అన‌లిస్ట్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్‌)-2
ఆఫీస‌ర్ (హ్యూమ‌న్ రిసోర్స్‌) -2
ఆఫీస‌ర్ (కంపెనీ సెక్ర‌టెరీ) 1
ఆఫీస‌ర్ (రాజ్‌భాష అధికారి) 1

ఈ పోస్టుల‌ను షార్ట్‌లిస్ట్ , ఇంట‌ర్వ్య‌లతో ఎంపిక చేస్తారు. సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ/ డిప్లొమా సిఎ/ ఐసిడ‌బ్ల్యుఎ / సిఎస్ తో పాటు రేండేళ్ల ప‌ని అనుభ‌వం ఉండాలి.

ద‌ర‌ఖాస్తుల‌ను ఆఫ్‌లైన్‌లో వ‌చ్చే నెల 12వ తేదీ లోపు పంపించాలి. ద‌ర‌ఖాస్తు చేసుకునే వారి వ‌య‌స్సు ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ పోస్టుల‌కు 40 ఏళ్లు, ఇత‌ర పోస్టుల‌కు 35 ఏళ్లు మించ‌కూడ‌దు. ద‌ర‌ఖాస్తు ఫీజు రూ.100.. డిడి ద్వారా చెల్లించాలి.

ద‌ర‌ఖాస్తుల‌ను ఎజిఎం (హెచ్ ఆర్‌), సిమెంట్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌, పోస్ట్ బాక్స్ నంబ‌ర్‌, 3061, లోధి రోడ్ పోస్ట్ ఆఫీస్ , న్యూఢిల్లీ అనే చిరునామాకు పంపించాలి.

 

Leave A Reply

Your email address will not be published.