కాకినాడ జిల్లాలో 42 ఆశా వర్కర్ పోస్టులు
కాకినాడ జిల్లాలో 42 ఆశా వర్కర్ పోస్టుల భర్తీ చేయనున్నారు. ఎపి ప్రభుత్వం , జిల్లా వైద్య, ఆరోగ్య కార్యాలయం.. కాకినాడ జిల్లా ఆరోగ్య సమితి ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (PHCs), పట్టణ ఆరోగ్య కేంద్రాల (UPHCs) లో తాత్కాలిక ప్రాతిపదికన ఈ పోస్టులు భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు జులై 7 నుండి 9వ తేదీ లోపు ఆప్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
గ్రామీణ ప్రాంతాల్లో 29 పోస్టులు కలవు. చెబ్రోలు, దుగ్గుదురు, గొల్లపాలెం, పండూరు, సమర్ప, తురంగి, నాగులపల్లి, తేటగుంట తదితర ప్రాంతాలు..
పట్టణ ప్రాంతాల్లో 13 పోస్టుఉల కలవు. నరసింహారావు వీధి, రామారావు పేట, రెచ్చర్ల పేట, కోకిల వాని హాస్పిటల్ రోడ్ , శంకరయ్య పేట తదితల వార్డుల్లో ఖాళీలు ఉన్నట్లు సమాచారం.
పదో తరగతి ఉత్తీర్ణులై, తెలుగు చదవడం, రాయడం వచ్చి ఉండాలి.
25 నుండి 45 సంవత్సరాల మధ్య ఉండాలి. వివాహితలు, భర్త చనిపోయిన వారికి, విడాకులైన వారు లేదా ఒంటిరిగా జీవిస్తున్న మహిళలకు ప్రాధన్యత ఉంటుంది. సామాజిక సేవా దృక్పథం కలిగి ఉండాలి.
దరఖాస్తు తేదీ జులై 7 నుండి 9 వరకు
మెరిట్ లిస్ట్ జులై 16
తురి మెరిట్ లిస్ట్ జులై 21
నియామక ఉత్తర్వులు జారీ తేదీ జులై 25