Journalist: విలేకరి..

విలేకరి..

సమస్త మానవాళి మనుగడ కోసం

నీ ప్రాణాలను పన్నంగా పెట్టీ ఉద్యోగం చేస్తున్న

వీరుడా ఓ విలేకరి అందుకో మా అభినందనలు..!

 

పెరుకపోయిన అంతుచిక్కని సామాజిక రుగ్మతలను

పెన్నుతో నయం చేసిన సామాజిక వైద్యుడా
ఓ విలేకరి అందుకో మా అభినందనలు..!

 

దోపిడి దౌర్జన్యాలను కలంతో అతంచేసి

ప్రజా మన్నలను పొందిన ధైర్యవంతుడా

ఓ విలేకరి అందుకో మా అభినందనలు..!

 

మహిళలపై జరగుతున్న ప్రతీ సంఘటనలను

కలంతో సమాజం ముందు వుంచుతు,

వీరనారీమణుల జీవిత చరిత్రను తెలుపుతూ

మహిళలో ధైర్యసాహసాలు నింపిన ఆత్మీయుడా

ఓవిలేకరి అందుకో మా అభినందనలు..!

 

అహర్నిశలు సమాజం కోసం కష్టపడే మీరు

ఆయురారోగ్యాలతో పదికాలాలపాటు సంతోషంగా

ఉండాలని మంచి రోజులు రావాలని కోరుకుంటూ…

మంజుల పత్తిపాటి.
మాజీ డైరెక్టర్
ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ .

 

Leave A Reply

Your email address will not be published.