తెలంగాణలో 48 డెంటల్ సర్జన్ పోస్టులు
రాష్ట్రంలో 48 డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం పరిధిలో మెడికల్ & హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (MHSRB) ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులు తెలంగాణ వైద్య విధాన పరిషత్ , ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ , విభాగాల్లో భర్తీ చేస్తారు.
1-7-2025 నాటికి 18 నుండి 46 ఏళ్ల వయస్సు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్ సి/ ఎస్‌టి/ బిసి / ఇడబ్ల్యుఎస్ వారికి 5 ఏళ్లు.. దివ్యాంగులకు 10 ఏళ్లు , ప్రభుత్వ ఉద్యోగులకు 5 ఏళ్లు మినహాయింపు
దరఖాస్తులను ఈ నెల 14వ తేదీ నుండి 25వ తేదీ లోపు స్వీకరిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500.. ప్రాసెసింగ్ ఫీజు రూ.200.
బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ లేదా సమానమైన అర్హత కలిగి ఉండాలి. అదేవిధంగా తెలంగాణ డెంటల్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. విదేశి డిగ్రీలు పొందిన వారు ఎఫ్‌డిఎస్‌టి మార్కుల ఆధారంగా నిర్ణయిస్తారు.
విద్యార్హతల్లో పొందిన మెరిట్ , ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్ / ఔట్‌సోర్స్‌డ్ సేవల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపిక అ భ్యర్థులకు రూ. 58,850 నుండి రూ.1,37,050 వేతనం నెలకు అందుతుంది.