ప్రముఖ నటుడు `కోట` కన్నుమూత
హైదరాబాద్ (CLiC2NEWS): ప్రముఖ టాలీవుడ్ నటుడు కోటా శ్రీనివాస రావు (83) ఇక లేరు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న కోటా ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని తన నివాసం తుది శ్వాస విడిచారు. కృష్ణా జిల్లా కంకిపాడులో 1942, జూలై 10న కోట శ్రీనివాసరావు జన్మించారు. ఆయనకు భార్య రుక్మిణి, ఇద్దరు కుమారు, ఒక కుమార్తె ఉన్నారు.
గతంలో కోటా శ్రీనివాస రావు బ్యాంకులో ఉద్యోగిగా పనిచేశారు. ఆయన తెగుతోపాటు తమిళ, హిందీ, కన్నడ చిత్రాల్లో కూడా నటించారు. కోటా ఇప్పటి వరకు 9 నంది పురస్కారాలు అందుకున్నారు. అలాగే 2012లో సైమా అవార్డు అందుకున్నారు. 2015లో పద్మశ్రీ పురస్కారం రాష్ట్రరపతి ప్రనబ్ ముఖర్జీ చేతుల మీదుగా అందుకున్నారు. 1999లో విజయవాడ నుంచి బిజెపి ఎమ్మెల్యేగా పనిచేశారు. కోటా శ్రీనివాసరావు ఇప్పటి వకు 750కి పైగా చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించారు.