UBIలో 500 అప్రెంటిస్ ఖాళీల భర్తీ
UBI: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండయాలో 500 అప్రెంటిస్ ఖాళీలను భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న యుబిఐ శాఖల్లో ఒక సంవత్సరం కాలవ్యవధికి అప్రెంటిస్ లను భర్తీ చేయనున్నారు. నెలకు స్టైపెండ్ రూ. 15వేలు చెల్లిస్తారు. గుర్తింపు పొందిన యూనివర్సిటి నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థలు అర్హులు. దరఖాస్తులను సెప్టెంబర్ 17 తేదీలోగా పంపించాల్సి ఉంది. జనరల్/ ఒబిసి అభ్యర్థులు రూ. 800 .. ఎస్‌టి , ఎస్‌సి , మహిళలకు రూ. 600 .. దివ్యాంగులు రూ.400 దరఖాస్తు చెల్లించాలి. ఆన్‌లైన్ టెస్ట్ ద్వారా ఎంపిక జరుగుతుంది. ఎపిలో 50 ఖాళీలు, తెలంగాణలో 42 ఖాళీలు ఉన్నాయి.