ఇరాన్ నుండి 517 మంది భార‌తీయుల రాక‌..

Operation Sindhu: ఇజ్రాయెల్-ఇరాన్ మ‌ధ్య ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో ఇరాన్‌లో ఉన్న భార‌తీయుల‌ను స్వ‌దేశానికి తీసుకొచ్చేందుకు ఆప‌రేష‌న్ సింధు చేప‌ట్టింది. ఇరాన్ ప్ర‌త్యేకంగా భార‌తీయుల కోసం గగ‌న‌త‌లాన్ని తెరిచింది. ఢిల్లీకి రానున్న 3 విమానాల కోసం గ‌గ‌న‌త‌ల ఆంక్ష‌ల‌ను ఎత్తివేసింది. శ‌నివారం సాయంత్రానిక‌ల్లా 517 మంది భార‌తీయులు భార‌త్‌కు వ‌చ్చిన‌ట్లు విదేశాంగ శాఖ వెల్ల‌డించింది.

ఇరాన్‌- ఇజ్రాయెల్ మ‌ధ్య నెల‌కొన్న ఉద్రిక్త‌త‌లు తీవ్ర‌మ‌వుతున్నాయి. ఈ క్ర‌మంలో భార‌తీయుల‌తో పాటు అనేక దేశాల ప్ర‌జ‌లు ఇరాన్‌లో చిక్కుకుపోయారు. భార‌తీయుల‌ను వెన‌క్కి తీసుకొచ్చేందుకు భార‌త్ ఆప‌రేష‌న్ సింధున ప్రారంభించి అక్క‌డి భార‌తీయుల‌ను వెన‌క్కి తీసుకొస్తుంది. దీనిలో భాగంగా పొరుగు దేశాల‌కు చెందిన వారిని సైతం త‌ర‌లిస్తూ గొప్ప మ‌న‌సును చాటుకుంది. త‌మ ప్ర‌జ‌ల‌ను కూడా త‌ర‌లించాల‌ని నేపాల్‌, శ్రీ‌లంక దేశాలు భారత్‌ను కోర‌గా.. భార‌త్ అందుకు అంగీక‌రించింది.

Leave A Reply

Your email address will not be published.