హుజూరాబాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అరెస్టు..
వరంగల్ (CLiC2NEWS): హుజూరాబాద్ బిఆర్ ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. క్వారీ యజమానిని బెదిరించిన కేసులో ఆయనను అరెస్టు చేసినట్లు సమాచారం. వైద్య పరీక్షల నిమిత్తం ఆయనను సుబేదారి పోలీసు స్టేషన్ నుండి ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆయనను కోర్టులో హాజరుపరచనున్నారు.