India Corona: దేశంలో కొత్త‌గా 8582 కేసులు

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో క‌రోనా మ‌ళ్లీ విజృంభిస్తోంది. రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య క్ర‌మంగా పెరుగుతోంది. వ‌రుస‌గా రెండో రోజు కూడా 8 వేల‌కు పైగా పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. తాజాగా దేశంలో 8,582 మందికి క‌రోనా పాజిటివ్ గా నిర్ధార‌ణ అయింది. ఈ మేర‌కు ఆదివారం ఉద‌యం కేంద్ర ఆరోగ్య మంత్ర‌త్వ శాఖ క‌రోనా బులిటెన్ విడుద‌ల చేసింది.

తాజా కేసుల‌తో క‌లిపి దేశంలో మొత్తం కేసులు 4,32,22,017కి చేరాయి. వీటిలో 4,26,52,743 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో 5,24,761 మంది మ‌ర‌ణించారు. ప్ర‌స్తుతం దేశంలో 44,513 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

గ‌త 24 గంట‌ల్లో దేశంలో క‌రోనా వైర‌స్ బారిన ప‌డి న‌లుగురు మ‌త్యువాత ప‌డ్డారు. అలాగే తాజాగా 4,435 మంది బాధితులు వైర‌స్‌నుండి కోలుకున్నార‌ని కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది.

Leave A Reply

Your email address will not be published.