జనం మెచ్చిన జననేత జగన్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడకలు ఇవాళ (డిసెంబరు 21, సోమవారం) తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. విప్లవాత్మక నిర్ణయాలు, చరిత్రాత్మక పథకాలతో అన్ని వర్గాల ప్రజల ఆదరణ చూరగొన్న జగన్… ఏడాదిన్నర కాలంలోనే ప్రజలు నమ్మకంతో అప్పగించిన అధికారాన్ని సద్వినియోగం చేసుకుంటూ వారి సంక్షేమానికి జగన్ కృషి చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
వైఎస్ జగన్ రాజకీయ నేపథ్యం..
మహానేతగా పేరు తెచ్చుకున్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడిగా రాజకీయరంగ ప్రవేశం చేసిన వైఎస్ జగన్, అనతికాలంలోనే జనంలో ఆదరణ సంపాదించారు. తండ్రి రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్ ఎంపీగా పనిచేశారు. వైఎస్ నుంచి రాజకీయ వారసత్వం అందుకున్న జగన్, తండ్రి మరణం తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి తన బలాన్ని నిరూపించుకున్నారు. ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తరువాత జగన్ ఆంధ్రప్రదేశ్ పై మాత్రమే దృష్టి పెట్టగా 2014 ఎన్నికల్లో మెరుగైన స్థానాలు గెలుచుకున్నారు. 2019 ఎన్నికలకు ముందు జగన్ చేసిన పాదయాత్ర ఆయనకు కలిసి వచ్చింది. ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలుసుకున్నారు. ప్రజలకు ఏం కావాలో గుర్తించి ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపరిచి హామీలు ఇచ్చారు.
2019 ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో 175 శాసన సభ స్థానాలకుగాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 స్థానాలు రికార్డు స్థాయిలో గెలిచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. అంతే కాకుండా 2019 సాధారణ ఎన్నికల్లో ఆయనే ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక మెజారిటీ సాధించిన శాసన సభ్యుడు. సుమారు 90000 పైగా మెజార్టీతో గెలవడం ఆయన పట్ల ప్రజలకి ఉన్న విశ్వాశానికి నిదర్శనం. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే ఆయన గొప్ప నైజం ప్రజలలో ఆయనకి అంతటి ప్రాముఖ్యతని పేరుని తెచ్చిపెట్టాయి అనడంలో సందేహం లేదు.
2019 ఎన్నికల్లో భారీ విజయం సాధించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ జననేతగా పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘నవరత్నాలు’ కార్యక్రమంలోని సంక్షేమ పథకాలకు ప్రజల నుంచి గొప్ప స్పందన లభించింది. ఈ పథకాలు జాతీయ స్థాయిలో ఆకట్టుకుంటున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మేనిపెస్టోలో చెప్పిన హామీలను అమలు చేసేందుకు జగన్ తీసుకుంటున్న కీలక నిర్ణయాలే ఆయన పాలనపై ప్రజల్లో విశ్వాసం పెంచిందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఇలాగే ప్రజల ఆదరాభిమానాలు పొందాలని కోరుకుందాం…
[…] జనం మెచ్చిన జననేత జగన్ […]
[…] జనం మెచ్చిన జననేత జగన్ […]
[…] జనం మెచ్చిన జననేత జగన్ […]
[…] జనం మెచ్చిన జననేత జగన్ […]