దేశంలో కొత్త‌గా 43,846 క‌రోనా కేసులు

న్యూఢిల్లీ:  భార‌త్‌లో మ‌ళ్లీ క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. దేశంలో రోజువారీగా న‌మోద‌వుతున్న కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ  పెరుగుద‌ల‌తో ప్ర‌జ‌లు తీవ్ర భ‌యాందోళ‌న‌లకు గుర‌వుతున్నారు. డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో దేశంలో కొత్త‌గా 43,846 పాజిటివ్‌ కేసులు న‌మోద‌య్యాయి. ఈ మేర‌కు ఆదివ‌రం కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వశాఖ క‌రోనా బులిటెన్ విడుద‌ల చేసింది.

తాజాగా నమోదైన కేసులతో క‌లిపి దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం కేసుల సంఖ్య 1,15,99,130కు పెరిగింది. అలాగే కొత్తగా 22,956 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు.  ఇప్పటి వరకు మొత్తం 1,11,30,288 మంది డిశ్చార్జి అయ్యారు. తాజాగా కొవిడ్ తో  మరో 197 మంది మృత్యువాతపడ్డారు. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో మొత్తం మరణాల సంఖ్య 1,59,755కు చేరింది. ప్రస్తుతం దేశంలో 3,09,087 యాక్టివ్‌ కేసులున్నాయని అధికారులు బులిటెన్‌లో పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.