తెలంగాణలో కొత్త‌గా 887 కరోనా కేసులు

హైద‌రాబాద్‌: తెలంగాణలో గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో కొత్త‌గా 887 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేర‌కు గురువారం ఉద‌యం రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ క‌రోనా బులిటెన్ విడుద‌ల చేసింది. తాజా కేసుల‌తో క‌లిపి ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,08,776కి చేరింది. వీటిలో 3,01,564 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, ప్ర‌స్తుతం 5511 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.
గ‌డిచిన 24 గంటల వ్య‌వ‌ధిలో తెలంగాణలో కరోనాతో నలుగురు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1701కి చేరిందని అధికారులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.