AP: ఆగ‌స్టులో APPSC నోటిఫికేష‌న్

అమ‌రావ‌తి (CLiC2NEWS): వ‌‌చ్చే నెల‌లో APPSC నోటిఫికేష‌న్ ఇస్తున్న‌ట్లు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర APPSC స‌భ్యుడు షేక్ స‌లాంబాబు తెలియ‌జేశారు. ఆయ‌న మాట్లాడుతూ.. గ్రూప్-1,గ్రూప్‌-2 స‌హా మ‌రికొన్ని విభాగాల‌లో పోస్ట‌లు పెంచి ఆగ‌స్టు నెల‌లో నోటిఫికేష‌న్ ఇస్తామ‌న్నారు. పోస్టులు పెంచేందుకు ప్ర‌భుత్వ చ‌ర్య‌లు చేప‌ట్టిన‌దని, ఇప్ప‌టి వ‌ర‌కు 1180 ఖాళీ పోస్టుల‌ను గుర్తించ‌డం జ‌రిగిన‌దని ఆయ‌న తెలిపారు. ఇంకా ఖాళీగా ఉన్న పోస్టుల వివ‌రాలు రావాల్సి ఉంద‌ని వివ‌రించారు.
త్వ‌ర‌గా ఉద్యోగాలు భ‌ర్తీచేయడం కోసం ఇక‌పై ఎపిపిఎస్సి నియామ‌కాల‌కు ప్రిలిమ్స్ ఉండ‌ద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. గ్రూప్-1 మిన‌హాయించి మిగిలిన ఏ నోటిఫికేష‌న్‌కు ఒకే ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. అభ్య‌ర్థుల వ‌యోప‌రిమితి 47 ఏళ్ల‌కు పెంచాల‌ని వ‌చ్చిన విన‌తుల‌ను ప‌రిశీలించ‌డానికి ప్ర‌భుత్వానికి పంపాం. అనుమ‌తి రాగానే వ‌యోప‌రిమితి పెంపుపై నిర్ణ‌యం తీసుకుంటామ‌ని ఆయ‌న వెల్ల‌డించారు.

Leave A Reply

Your email address will not be published.