గ్రామీణ తపాలా జీవిత బీమాను ప్రోత్సహించండి
రాయవరం (CLiC2NEWS): అతి తక్కువ ప్రీమియం, అధిక వడ్డీని ఇచ్చే తపాలా జీవిత బీమా పథకాలను ప్రజలు అందరూ ఆదరించాలని రామచంద్రపురం సబ్ డివిజినల్ పోస్టల్ ఇన్స్పెక్టర్ ఎం లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు. భారతదేశంలో మొట్టమొదటి ఇన్సూరెన్స్ తపాలాశాఖలో ప్రారంభమైందని తెలిపారు. శుక్రవారం కొమరిపాలెం గ్రామంలో బ్రాంచ్ పోస్టుమాస్టర్ రామకృష్ణ ఆధ్వర్యంలో పంచాయతీ ఆఫీసులో కార్యదర్శి సత్తి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన గ్రామ వాలంటీర్లకు, సచివాలయ సిబ్బందికి తపాలాశాఖ ఇన్సూరెన్స్ అవగాహన సదస్సు నిర్వహించారు. కొమరిపాలెం ప్రజలంతా పోస్ట్ ఆఫీస్ పథకాలను ప్రోత్సహిస్తున్నారని అధిక వడ్డీని అధిక బోనసు ఇచ్చే గ్రామీణ తపాలా జీవిత బీమాను గ్రామ వాలంటీర్లు ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విఆర్వో వోగిరెడ్డి శ్రీనివాసు, కొంకుదురు, కొప్పవరం, వెదురుపాక సావరం బ్రాంచ్ పోస్టుమాస్టర్ వై స్పర్జన్ రాజు, సునీత, ఐ సత్యనారాయణ, రాయవరం సబ్ పోస్టాఫీసు సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
