మండపేట నియోజక వర్గంలో బిజెపి బలోపేతానికి కృషి చేయాలి..
కపిలేశ్వరపురం (CLiC2NEWS): మండపేట నియోజక వర్గంలో భారతీయ జనతాపార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలని జిల్లా ఉపాధ్యక్షులు కోన సత్యనారాయణ పిలుపునిచ్చారు. మంగళవారం కపిలేశ్వరపురం మండలం అంగరలో బీజేపీ మండల కమిటీ సమావేశం జరిగింది. మండల అధ్యక్షుడు తోరంరాము అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అథితులుగా అమలాపురం జిల్లా ఉపాధ్యక్షులు కోనసత్యనారాయణ పాల్గొని మాట్లాడారు పూర్తిస్థాయిలో మండల కమిటీలు, యువ, కిసాన్ ఇలా అన్ని మోర్చాలు వేయాలని, అందరూ సమిష్టిగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని రాబోయే జెమిలి ఎలక్షన్ లో ఆంద్రాలో కూడా గ్రామస్దాయినుండే జెండా ఎగరేసే విధంగా కృషిచేయాలన్నారు.. ఈ సమావేశం ముఖ్యంగా మండలంలో పాడయ్యిన రోడ్లును వెంటనే వెయ్యాలని, డ్రైనేజీ వ్యవస్థను తక్షణం పునర్నిర్మించాలని, , కేంద్ర ప్రభుత్వ పథకం “జల కళ్యాణ్ యోజన” ద్వారా ప్రతి ఇంటికి ఉచిత మంచినీటి కుళాయి వెయ్యాలని, దోమలను నియంత్రించాలని ఈ సమస్యలను పరిష్కరించేందుకు బీజేపీ మండల కార్యవర్గం తగిన కృషి చెయ్యాలని ఈ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ సమావేశం లో కోన మాట్లాడుతూ గరీబ్ జన కళ్యాణ్ యోజన పథకం క్రింద కేంద్ర ప్రభుత్వ ఉచిత బియ్యం పంపిణి పథకం నవంబర్ వరకు పేదలందరికి అందే విధంగా చూడాలన్నారు. ప్రతి కేంద్ర ప్రభుత్వ పథకం పేద బడుగు వర్గాలకు చేరేలా బీజేపీ నాయకులూ ప్రతిఒక్కరు కృషిచెయ్యాలని కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇస్తున్న ఉచిత వాక్సిన్ పథకం ప్రజలందరికీ అందేలా బీజేపీ లోని ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త కృషి చెయ్యాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఓబీసీమోర్చ జిల్లా ఉపాద్యక్షులు సూరంపూడి సత్యనారాయణ,ఎస్.సి మోర్చ జిల్లా కార్యదర్శి పెదపాటి వసంత,యువమోర్చ జిల్లా కార్యదర్శి నాళం ఫణిప్రకాష్,మండల కార్యదర్శి సూరంపూడి రాజా,మేడిశెట్టి నాగరాజు,కిసాన్ మోర్చ నంబుల వెంకన్న తదితర నాయకులూ కార్యకర్తలు పాల్గొన్నారు.