Mandapeta: వైఎస్సార్ కంటి వెలుగు సద్వినియోగం చేసుకోవాలి..

మండపేట (CLiC2NEWS): కంటి సమస్యలు ఉన్నవారంతా వైఎస్సార్ కంటి వెలుగు కార్య‌క్ర‌మాన్ని సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ దుర్గారాణి పేర్కొన్నారు. 22వ వార్డు మేధర పేట లో 3వ దశ కంటి వెలుగు కార్యక్రమం నిర్వహించారు. రెవరెండ్ ఫాదర్ చిలుకూరి ఉదయ భాస్కర్ బేతెస్త ప్రార్థనాలయంలో మంగళవారం జరిగిన కార్యక్రమానికి చైర్ పర్సన్ రాణి ముఖ్య అతిథిగా పాల్గొని కంటి వెలుగు ప్రారంభించారు.

కంటి వెలుగు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాష్ట్రమంతా అమలు చేస్తున్నారని అన్నారు. కంటి సమస్యలతో బాధ పడే వృద్ధులకు ఈ కంటి వెలుగు చూపును ఇస్తుంది అన్నారు. ఉదయ్ భాస్కర్ మాట్లాడుతూ మనిషి అవయవాలు అన్నింటిలో నేత్రాలు ప్రధానం అన్నారు. నేత్రాలు ఆరోగ్యంగా ఉంటే మనిషి శరీరం ఆరోగ్యంగా ఉంటుందని పెద్దల నానుడి అన్నారు. ఇంత మంచి కంటి వెలుగు కార్యక్రమం చేపట్టి పేదలకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తున్న ప్రభుత్వం కు ధన్యవాదాలు తెలిపారు.

అనంతరం కంటి వెలుగు వైద్యులు డాక్టర్ సూరం పూడి సత్యనారాయణ వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 22 వార్డు వైఎస్సార్సీపీ ఇన్ చార్జి అన్యం ప్రసాద్, 22 వ వార్డు కౌన్సిలర్ బొక్కా సరస్వతి, 21 వ వార్డు వైఎస్సార్సీపీ ఇన్ ఛార్జ్ కంది నాగశ్రీదేవి, 10 సచివాలయం అడ్మిన్ కొత్తపల్లి సత్తిబాబు, ఏ ఎన్ ఎం రామ రాజేశ్వరి, ఆశవర్కర్ సూర్య లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.