Mandapeta: ప్ర‌జ‌లంతా అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే వేగుళ్ల

మండపేట (CLiC2NEWS): రాబోయే రోజుల్లో కరోనాథర్డ్ వేవ్ వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు విజ్ఞప్తి చేసారు. ప్రజలంతా చాలా జాగ్రత్తగా ఉండాలని కోరారు. ప్రక్క రాష్ట్రాలలో 18 ఏళ్ళు దాటిన ప్రతీ ఒక్కరికీ వ్యాక్సినేషన్  ఇవ్వడం ఎప్పుడో మొదలుపెట్టారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 18 ఏళ్ళు నిండిన ప్రతీ ఒక్కరికీ టీకా వెస్తామని చెప్పి సుమారు రెండు నెలలు కావస్తున్నప్పటికీ ఇప్పటివరకు వెయ్యలేదన్నారు. మండపేట నియోజకవర్గంలో 18 ఏళ్ళు నిండిన ఏ ఒక్కరికీ టీకా వెయ్యకపోవటం చాలా దారుణమన్నారు. దీనికి కారణం ప్రభుత్వం ప్రజలకు తెలియజేయాలన్నారు. కరోనా టీకా వేయించుకుంటే చాలా వరకూ సేఫ్ జోన్ అని వైద్యులు, ప్రభుత్వం చెబుతోందన్నారు. ప్రతీ ఒక్కరికీ టీకా వెంటనే వెయ్యాలన్నారు. మండపేట నియోజకవర్గంలో ప్రైవేటు హాస్పటల్స్, ఆర్.ఎం.పి లు  సిటీ స్కాన్ సెంటర్స్ వద్ద రోజు అనేక మంది కరోనా టెస్ట్ లు చేయించుకుంటున్నారని అందులో 90 శాతం పాజిటివ్ గా నిర్ధారణ అవుతున్నాయని ఆయ‌న అన్నారు. అంద‌రికీ టీకాలు అందించే విధంగా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఎమ్మెల్యే ప్ర‌భుత్వాన్ని కోరారు.

Leave A Reply

Your email address will not be published.