ప్రభుత్వ పథకాలను రైతులందరికీ చేరేలా కృషి చేస్తా..

ఏడిద నూతన సొసైటీ చైర్మన్ రామిశెట్టి శ్రీహరి వెల్లడి..

మండపేట (CLiC2NEWS): వ్యవసాయ సహకార పరపతి సంఘం ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలను రైతులందరికీ చేరేలా కృషి చేస్తానని ఏడిద సహకార సంఘం నూతన అధ్యక్షుడు రామిశెట్టి శ్రీహరి పేర్కొన్నారు. మండలంలోని ఏడిదలో ఉన్న వ్యవసాయ సహకార సంఘానికి నూతన పాలక వర్గం ఏర్పడింది. సొసైటీకి నూతన సభ్యులుగా కొత్తగా ఏర్పాటైన కమిటీ మంగళవారం ప్రమాణ స్వీకారం చేసింది. ఈ సందర్భంగా గ్రామంలోని వినాయకుడి గుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి సహకార సంఘం కార్యాలయానికి వెళ్లారు. సొసైటీ కార్యదర్శి నామాల జగదీష్ నూతన కమిటీ సభ్యులు చేత ప్రమాణ స్వీకారం చేయించారు. గ్రామ సర్పంచ్ బూరిగ ఆశీర్వాదం కార్యక్రమానికి అధ్యక్షత వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆశీర్వాదం మాట్లాడుతూ ఏడిద సొసైటీకి నూతన పాలకవర్గం ఏర్పాటు కావడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. కమిటీ సభ్యులంతా ఒకరికొకరు సమన్వయం చేసుకుంటూ గ్రామంలోని రైతుల అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. స్థానికంగా రైతులకు ఏ సమస్య వచ్చినా కమిటీ సభ్యులంతా వారికి అండగా నిలిచి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను రైతులందరికీ నిష్పక్షపాతంగా అర్హులైన వారందరికీ చేరవేసి జిల్లాలోనే ఆదర్శవంతమైన సొసైటీగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన రామిశెట్టి శ్రీహరి మాట్లాడుతూ గ్రామంలోని రైతు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. సహకార సంఘం అందించే ప్రభుత్వ పథకాల లబ్ధిని ప్రతి రైతుకు అందించడానికి పాటు పడతానన్నారు. రైతులందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి అభివృద్ధి కోసం పని చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు కుడుపూడి గణేశ్వరరావు, పైడిమళ్ళ యేసేబు, ఉపసర్పంచ్ చండ్ర శ్రీను, చిలుకూరి బుజ్జి, వల్లూరి రామకృష్ణ ,బలుసు చిన్నబాబు, బేతావెంకటేశ్వరరావు, పలివెల సుధాకర్, కుడుపూడి రాంబాబు, బూరిగ జానీ, రామిశెట్టి శ్రీనివాస్, పసుమర్తి నాగేశ్వరరావు, రామిశెట్టి వీర్రాజు, పడమట తరుణ్ కుమార్, రైతులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.