India Corona: స్వల్పంగా తగ్గిన కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గురువారం 41,195 పాజిటివ్‌ కేసులు నమోదవగా, తాజాగా అవి 40 వేలు రికార్డయ్యాయి. గ‌డిచిన 24 గంటల వ్య‌వ‌ధిలో దేశంలో కొత్త‌గా 40,120 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేర‌కు కేంద్ర ఆరోగ్య‌శాఖ శుక్ర‌వారం క‌రోనా బులిటెన్ విడుద‌ల చేసింది.
తాజా కేసుల‌తో క‌లిపి దేశంలో మంత్తం కేసుల సంఖ్య 3,21,17,826కు చేరింది.

  • తాజాగా గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో 42,295 కోలుకున్నారు.
  • తాజా రిక‌వ‌రీలతో క‌లిపి దేశంలో మొత్తం 3,13,02,345 మంది బాధితులు కోలుకోగా,
  • ప్ర‌స్తుతం 3,85,227 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
  • తాజాగా గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో 585 మంది మృతిచెందారు.
  • ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో మొత్తం 4,30,254 మంది బాధితులు మరణించారు.
  • దేశంలో ఇప్పటివరకు 52,95,82,956 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశామని ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Leave A Reply

Your email address will not be published.