స్వాతంత్ర్య సమరయోధుల చరిత్రలను నేటితరం తెలుసుకోవాలి..
మండపేట తహసీల్దారు తంగెళ్ల రాజారాజేశ్వర రావు

మండపేట (CLiC2NEWS): స్వాతంత్ర్య సమరయోధులు, దేశభక్తి పరులు, దేశ నాయకుల చరిత్ర నేటి తరాలు తప్పకుండా తెలుసుకోవాలి,వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని మండపేట తహసీల్దార్ రాజ రాజేశ్వర రావు కోరారు. 75 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా తన కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం సిబ్బందిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగఫలం మన దేశానికి స్వాతంత్ర్యం అని ఆయన అన్నారు. భారతదేశం గొప్ప ప్రజాస్వామిక దేశమని మనమంతా ఈ దేశంలో పుట్టినందుకు గర్వపడాలి అని ఆయన అన్నారు. విద్యార్థులు జాతీయ గేయాలు ఆలపించారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ కంఠంశెట్టి గౌరి దేవి, డిప్యూటీ తహసీల్దార్, వీఆర్వోలు పాల్గొన్నారు.