Mandapeta: ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు
మండపేట (CLiC2NEWS): ప్రజలంతా ప్రపంచవ్యాప్తంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారని శ్రీకృష్ణయాదవ సంఘం వ్యవస్థాపకులు, యాదవసెల్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ కోన సత్యనారాయణ పేర్కొన్నారు. సోమవారం మండపేటలో ఆయన నివాసం వద్ద శ్రీకృష్ణ జయంతి వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు. సాంప్రదాయ పద్ధతిలో కృష్ణుణ్ణి భజిస్తూ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణుని అవతారాలు అన్ని యుగాల్లోనూ ఉన్నాయని ఆ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ పరమాత్ముడు అని ఆయన కొనియాడారు. శ్రీరామచంద్రుడిగా శ్రీకృష్ణునిగా దశావతారాలుగా కృష్ణుడు ఎంతో ప్రాముఖ్యత కలిగిన పురాణ పురుషుడు అని ధర్మసంస్థాపన కోసం ఆయన జన్మించారని వివరించారు. మానవుల్లో భక్తి ప్రవర్తలు పెంపొందించడానికి శ్రీకృష్ణుని ఆరాధించాలి అన్నారు. కృష్ణతత్వం ప్రేమతత్వం లో ఎంతో ఇతిహాసం దాగి ఉందని ఆయన అన్నారు. కృష్ణుని లీలలు ఆయన గుర్తు చేస్తూ దుష్ట సంహారం కోసం ద్వాపరయుగంలో ఆ శ్రీమన్నారాయణుడే కృష్ణభగవానుడిగా అవతరించారని ఆయన పేర్కొన్నారు. ముందుగా నల్లనయ్యను విగ్రహాన్ని ప్రతిష్ఠించి మహిళలు పూజలు నిర్వహించారు. కృష్ణ పరమాత్మునికి ప్రీతికరమైన బెల్లం అటుకులు, పులిహోర ప్రసాదాలను నివేదించారు. రామానుజం మాస్టారు, ప్రసాద్, కోనే వీర్రాజు, గుండు తాతరాజు, విజయానంద్, కోటిపల్లి కృష్ణమాచార్యులు, నాళం ఫణి ప్రకాష్, పంపన సత్యనారయణ (సోఫైన్ టైలర్స్ )దంపతులు, న్యాయవాది కేవీవీ సాయిరాం చుట్టు పక్కల మహిళలు పాల్గొని టెంకాయలు కొట్టి కృష్ణుణ్ణి ఆరాధించారు. మహిళలు భక్తి ఆలపించి భగవంతునికి సేవ చేశారు. అనంతరం ఉషశ్రీ, సత్యనారాయణ దంపతులు భక్తులకు ప్రసాదాన్ని పంచిపెట్టారు. ఏసీటీ ఛానల్ ఎడిటర్ టపా రామకృష్ణ స్వామి వారిని దర్శించుకున్నారు.