India Corona: కొత్తగా 30,941 కరోనా కేసులు
న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో కొత్తగా 30,941 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం కరోనా బులిటెన్ విడుదల చేసింది.
- గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 350 మంది మరణించారు.
- ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా మొత్తం 4,38,560 మంది కరోనాకు బలయ్యారు.
- గడిచిన 24 గంటల వ్యవధిలో ఈ మహమ్మారి నుంచి మరో 36,275 మంది కోలుకున్నారు.
- ప్రస్తుతం దేశంలో 3,70,640 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
- దేశంలో ఇప్పటి వరకు 64.05 కోట్లకు పైగా టీకా డోసుల పంపిణీ జరిగింది.