Mandapeta: ప్ర‌జ‌లంతా ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి: చైర్ పర్సన్ దుర్గారాణి

మండపేట (CLiC2NEWS): ప్రతి ఒక్కరూ వ్యక్తి గత శుభ్రతతో పాటు తమ తమ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి అని మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ దుర్గారాణి అన్నారు. మున్సిప‌ల్ కార్యాల‌యంలో మంగ‌ళ‌వారం త‌న చాంబర్ లో చైర్ ప‌ర్స‌న్ మీడియాతో మాట్లాడారు. పురపాలక సంఘం పరిధిలో ఉన్న అన్ని వార్డుల్లో పారిశుధ్యం మెరుగుకు కృషి చేస్తున్నామని తెలిపారు. వార్డులో పారిశుధ్య నిర్వహణకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వారానికోసారి డ్రై డే పేరున మరిన్ని మెరుగైన పనులు చేపడుతున్నామని తెలిపారు. ప్రస్తుతం ఉన్న వాతావరణాన్ని బట్టి ప్రజలంతా ఆరోగ్యం విషయంలో సరైన జాగ్రత్తలు పాటించాలని కోరారు. వర్షాకాలంలో తలెత్తే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఎక్కడా నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని అన్నారు. బయటి ప్రదేశాల్లో మున్సిపల్ సిబ్బంది తగిన చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. అయితే ఇండ్ల లోపల బాధ్యత ఆయా ఇంటి యజమానులదేనని అన్నారు. అన్నిచోట్లా పరిసరాలు శుభ్రంగా ఉంచుకోగలిగితే సీజనల్ వ్యాధుల నుండి రక్షణ పొందవచ్చన్నారు. ఇటీవల కాలంలో పట్టణంలో డెంగ్యూతో ఇద్దరు మృతి చెందారని వస్తున్న వార్తలను ఆమె కొట్టి పారేశారు. టైఫాయిడ్ జ్వరం తీవ్రత వల్ల వారిద్దరికీ ఇబ్బంది కలిగింది అన్నారు. ఏ ఒక్కరూ అనారోగ్యం బారిన పడకుండా ఉండాలన్నదే తన కోరిక అన్నారు. అందరూ సంపూర్ణ ఆరోగ్యంతో బాగుండాలని ఆమె ఆకాంక్షించారు.

2 Comments
  1. บาคาร่า says

    Hello Dear, are you really visiting this site daily, if so after that you will absolutely
    get good experience.

  2. Money Online says

    Wow, superb weblog format! How lengthy have you ever been blogging for? you make blogging look easy. The full look of your web site is wonderful, as neatly as the content!!

Leave A Reply

Your email address will not be published.