Mandapeta: తోట త్రిమూర్తులు తనయుడికి త‌ప్పిన ప్ర‌మాదం

అడ్డుగా వచ్చిన ముగ్గురు యువకుల్ని కాపాడబోయి ఎలక్ట్రికల్ పోల్ ని ఢీ కొట్టిన కారు..
బెలూన్లు ఓపెన్ కావడంతో స్వల్ప గాయాలతో బయటపడిన తోట పృథ్వీరాజ్..

మండపేట (CLiC2NEWS): వైయస్సార్సీపి యువనేత శాసనమండలి సభ్యులు తోట త్రిమూర్తులు తనయుడు తోట పృథ్వీరాజ్ కు పెను ప్రమాదం తప్పింది. అడ్డుగా వచ్చిన ముగ్గురు యువకుల్ని కాపాడడాలనే యత్నంలో కారును ఎలక్ట్రికల్ ట్రాన్స్ ఫార్మర్ పోల్ ను ఢీ కొట్టింది. దీంతో కారు బెలూన్లు ఓపెన్ కావడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాద ఘటన కు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
గణపతి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా మండపేటలో శుక్రవారం రాత్రి జరిగిన పలు దైవ కార్యక్రమాల్లో ఆయన పాల్గొనడం జరిగింది. ఇందులో భాగంగా పట్టణంలోని సైదిల్ పేట వీధిలో స్నేహ మిత్ర యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దీపోత్సవ కార్యక్రమానికి తోట పృథ్వీరాజ్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. రాత్రి సుమారు 10:30 గంటల వరకు అక్కడ జరిగిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలలో ఆయన పాలు పంచుకొని భక్తులతో సమయాన్ని గడిపారు. అనంతరం తన స్వగ్రామం వెంకటాయపాలెం తిరుగు ప్రయాణమయ్యారు. మండపేట నుండి రాత్రి దాదాపు 11:30 గంటల ప్రాంతంలో వెంకటాయపాలెం తన కారులో బయల్దేరిన పృథ్వీరాజ్ సరిగ్గా తన స్వగ్రామం వెంకటాయపాలెం వచ్చేసరికి కారు ప్రమాదానికి గురి అయింది. ఆయన ఇంటి సమీపంలోని ఓ వంతెన దాటుతుండగా పక్కనే ఉన్న లేఅవుట్ నుండి ముగ్గురు యువకులు బైకు మీద రోడ్డు మధ్యగా అడ్డు వచ్చారు. కారు డ్రైవర్ అప్రమత్తంగా ఉండటంతో యువకుల్ని గమనించి వెంటనే కారు ను పక్కకు తీసుకున్నారు. ఆ ముగ్గురు యువకులు కి ఎటువంటి ప్రమాదం జరగా కూడదనే ప్రయత్నంలో డ్రైవర్ కారుని రైట్ సైడ్ కి లాగి కిళ్ళీ బడ్డీ ని ఢీకొట్టారు. దాంతో పాటు కారు అదుపు తప్పి ఆ పక్కనే ఉన్న ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్ తో ఉన్న ఎలక్ట్రికల్ పోల్ ను ఢీ కొట్టారు. దీంతో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు కాగా కారు లోపల ఉన్న బెలూన్లు తెరుచుకోవడంతో పృథ్వీరాజ్ కారు డ్రైవరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అడ్డు వచ్చిన యువకుల్ని రక్షించబోయి కారు ప్రమాదానికి గురి అయినప్పటికీ ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకకుండా చిన్న చిన్న గాయాలతో బయటపడడంతో ఇటు రామచంద్రపురం నియోజకవర్గం, మండపేట నియోజకవర్గం ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కాగా అర్థరాత్రి ప్రమాదం జరిగినప్పటికీ ఈ వార్త ఆలస్యంగా వెలుగులోకి రావడంతో తోటను పరామర్శించేందుకు వైఎస్సార్సీపీ నాయకులు ప్రజలు వెంకటాయపాలెం తోట నివాసానికి క్యూ కడుతున్నారు. దీనిపై తోట త్రిమూర్తులు స్పందిస్తూ తన కుమారుడికి ఎలాంటి ప్రమాదం జరగలేదని ఆ విఘ్నేశ్వరుడే తన కుమారున్ని కాపాడారని పేర్కొన్నారు. ప్రజలెవరూ ఆందోళన చెందవలసిన పని లేదని అందరూ క్షేమంగానే ఉన్నారని ఆయన రెండు నియోజకవర్గాల ప్రజలకు తెలియజేశారు.

1 Comment
  1. Money Online says

    Wow, awesome weblog format! How long have you ever been running a blog for? you made blogging look easy. The full look of your web site is wonderful, as smartly as the content!!

Leave A Reply

Your email address will not be published.