బేలా బై పాస్ రోడ్డు మంజూరు కోసం కేంద్ర మంత్రి గడ్కరీకి వినతి పత్రం
నాగపూర్ (CLiC2NEWS): ఎంపీ సోయం బాపురావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ శుక్రవారం నాగపూర్ లో కేంద్ర రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ని కలిసి బేలా బైపాస్ రోడ్డు కొరకు వినతి పత్రం అందచేశారు.
ఆదిలాబాద్ నాగపూర్ జాతీయ రహదారి నం. 44 ను అనుసంధానం చేస్తూ రాజూర మీదుగా చంద్రాపూర్ వరకు ఉన్న అంతర్రాష్ట్రీయ రహదారి 363D గా మంజూరు అయింది. ఐతే ఈ రహదారి బేలా గ్రామం మధ్య నుండి వెళుతుంది ఈ రహదారి వల్ల భారీ వాహనాల రాకపోకలు అధికమయ్యి తరచు భారీ ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ఈ రహదారిని బేలా గ్రామానికి బై పాస్ ఏర్పాటు చేయవలసిందిగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ని కోరడం జరిగింది. దీనికి కేంద్ర రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల శాఖా మంత్రి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారు. దీనికి అవసరమైన ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు. ఈ సందర్భంగా ఎంపీ సోయం బాపూరావు , జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ ఆయనకు పుష్పగుచ్చాన్ని అందించి ధన్యవాదాలు తెలియ చేశారు.