ఆదర్శలో తోట పృథ్వీరాజ్ జన్మదిన వేడుకలు

మండపేట(CLiC2NEWS) : వైసీపీ యువ నాయకుడు తోట పృథ్వీరాజ్ పుట్టినరోజు వేడుకలను పట్టణంలోని ఆదర్శ హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ నిత్యాన్నదాన శిబిరంలో అనాథల మధ్య వైఎస్సార్సీపీ నాయకులు,కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. టౌన్ కన్వీనర్ ముమ్మిడివరపు బాపిరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ దుర్గారాణి, పార్టీ సీనియర్ నాయకుడు రెడ్డి రాథాకృష్ణలు హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. సంస్ధ వ్యవస్థాపకుడు కొల్లి విశ్వనాథం సిద్ధం చేసిన పలు రకాల ఆహార పదార్థాలతో అనాథలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ దుర్గారాణి మాట్లాడుతూ పృథ్వీ పుట్టిన రోజు సందర్భంగా ఆకలితో ఉన్న అనాథల కడుపు నింపడం తనకు ఎంతో సంతోషం కలిగించింది అన్నారు. పుట్టిన రోజుల నాడు ఇటువంటి సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ చేపట్టి లేనివారికి నలుగురికి అన్నం పెడితే ఎంతో పుణ్యం లభిస్తుంది. తద్వారా అభాగ్యుల ఆకలి తీరి వారు సంతృప్తి చెందుతారని అన్నారు. కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ పిల్లి గణేశ్వరరావు, 8వ వార్డు కౌన్సిలర్ మందపల్లి రవికుమార్,7వ వార్డు ఇంచార్జ్ మందపల్లి రుద్రకాంత్, 22వ వార్డు కౌన్సిలర్ బొక్కా సరస్వతి,12వ వార్డు కౌన్సిలర్ మలసాని సీతామహాలక్ష్మీ, 27వ వార్డు కౌన్సిలర్ నీలం దుర్గమ్మ,10వ వార్డు ఇన్ చార్జి కొప్పిరెడ్డి పద్మావతి, తాడి రామారావు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.