విఎస్‌యులో జాతీయ సేవ పథకం (NSS) అధికారులకు ఉత్తమ సేవా పురస్కారాలు
నెల్లూరు (CLiC2NEWS): ప్రభుత్వ శాఖలలో ఉత్తమ సేవ చేసిన వారికి గణతంత్ర వేడుకలు నాడు ఇచ్చే ఉత్తమ సేవా పురస్కారాలకు ముగ్గురు విశ్వవిద్యాలయం ఎన్ యస్ యస్ అధికారులు డా. ఉదయ్ శంకర్ అల్లం, ఎన్ యస్ యస్ సమన్వయ కర్త , విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం , డా. యం . వెంకట సుబ్బయ్య , ఎన్ యస్ యస్ ప్రోగ్రాం అధికారి, విశ్వోదయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల , వెంకటగిరి మరియు డా. పేరూరు వెంకట సాయి తేజ, ఎన్ యస్ యస్ ప్రోగ్రాం అధికారి, శ్రీ చైతన్య డిగ్రీ కాలేజీ, కావలి ఎంపిక అయ్యారు. వారికి విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జి యం సుందరవల్లి అవార్డ్ సర్టిఫికెట్స్ ప్రదానం చేసి అభినందించారు. ఈ ఈ సందర్భంగా ఉపకులపతి మాట్లాడుతూ గడచిన ఒక సంవత్సర కాలంలో సంభవించిన రెండో వేవ్ కోవిడ్ సంక్షోభంలో మరియు తుఫాను వరదలప్పుడు విశ్వవిద్యాలయం ఎన్ యస్ యస్ అధికారులు చేసిన సేవలకు గుర్తింపుగా ఉత్తమ సేవా పురస్కారం కు ఎంపికయ్యినట్లు తెలిపారు. జిల్లాలో ఎన్ యస్ యస్ వారు చేసిన మరియు చేస్తున్న సేవలను ప్రశంసించారు. విద్యార్థులులో సేవా భావాన్ని పెంపొందించే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో, సమాజ అభివృద్ధి లో విద్యార్థుల పాత్ర ఎంతో అవసరమని అందుకు వారికి తగిన ప్రోత్సాహాన్ని మరియు సహకారాన్ని అందించాలని కోరారు. విశ్వవిద్యాలయం రెక్టార్ ఆచార్య ఎం చంద్రయ్య గారు, డా. ఎల్ విజయ కృష్ణా రెడ్డి గారు, కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సుజా ఎస్ నాయర్ మరియు అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది అభినందనలు తెలియజేశారు.